అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రాట్ ల నినాదం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రాట్ ల నినాదం

17-06-2019

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రాట్ ల నినాదం

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే క్యూబాతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు కృషి చేస్తామని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఈ నేతలు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యూబా పట్ల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. డెమోక్రాటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష  ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్న దాదాపు 20 మంది నేతలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో సెనేటర్‌ అమీ క్లబుచర్‌ క్యూబాతో సంబంధాల మెరుగుదల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.