మిస్‌ అమెరికా 2017 గా ఎంపికైన శాస్త్రవేత్త!
MarinaSkies
Kizen
APEDB

మిస్‌ అమెరికా 2017 గా ఎంపికైన శాస్త్రవేత్త!

16-05-2017

మిస్‌ అమెరికా 2017 గా ఎంపికైన శాస్త్రవేత్త!

అందగత్తెల పోటీల్లో ఫ్యాషన్‌ రంగంపై ఇష్టం, ఆసక్తి ఉన్న మగువలే పాల్గొంటారని, విజేతలుగా నిలుస్తారని భావించే వారికి అదంతా అవాస్తమని తెలియజేసే  ఓ ఘటన జరిగింది. మిస్‌ అమెరికా 2017 అందగత్తెల పోటీల్లో ఆసక్తికరంగా ముగిసింది. వాషింగ్టన్‌ నగరానికి చెందిన కారా మెక్‌క్యూల్లోఫ్‌ అనే 25 ఏళ్ల యువతి మిస్‌ అమెరికా 2017 విజేతగా నిలిచింది. ఇందులో విశేషం ఏముందనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అందగత్తెగా నిలిచిన మెక్‌క్యూల్లోఫ్‌ ఓ శాస్తవేత్తగా పనిచేస్తుండడం విశేషం. యుఎస్‌ న్యూక్లియర్‌ రెగ్యూలేటరి కమీషన్‌లో శాస్త్రవేత్తగా మెక్‌క్యూల్లోఫ్‌ పనిచేస్తుంది. లాస్‌ వేగాస్‌లో జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఈ గెలుపుపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది. సైన్స్‌, టెక్నాలిజీ, ఇంజనీరింగ్‌, మాథ్స్‌ రంగాలవైపు పిల్లలు అడుగులు వేసేలా ప్రేరణ కలిగిస్తానని ఆమె తెలిపింది.