షాంపూలు, లోషన్లతో చిన్నారులకు ప్రమాదం!

షాంపూలు, లోషన్లతో చిన్నారులకు ప్రమాదం!

18-06-2019

షాంపూలు, లోషన్లతో చిన్నారులకు ప్రమాదం!

చిన్నారుల శుభ్రతకు వినియోగించే షాంపూలు, లోషన్లు, గోళ్లరంగు వంటివి అత్యంత ప్రమాదకారకాలని అమెరికాలోని నేషన్‌వైడ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పరిశోధకులు వెల్లడించారు. వీటిని వినియోగిస్తున్న కారణంగా ప్రతి రెండు గంటలకు ఓ చిన్నారి ఆస్పత్రి పాలవుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తుల్లోని రసాయనాలు చిన్నారుల శరీరం, కళ్లు, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్‌ క్లినికల్‌ పీడియాట్రిక్స్‌లో ప్రచురించారు.