ఇంటర్నెట్ ఒపీనియన్ పోల్స్ లీకేజ్ పై ట్రంప్ ఆగ్రహం

ఇంటర్నెట్ ఒపీనియన్ పోల్స్ లీకేజ్ పై ట్రంప్ ఆగ్రహం

18-06-2019

ఇంటర్నెట్ ఒపీనియన్ పోల్స్ లీకేజ్ పై ట్రంప్ ఆగ్రహం

వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల రేసులో తాను డెమొక్రాట్‌ల కంటే వెనుకబడి ఉన్నట్టు వెలువడిన ఇంటర్నెట్‌ ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాల లీకేజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రచార బృంద సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రాటిక్‌ పార్టీ, తరపున అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌, తదితర నేతల కన్నా ట్రంప్‌ వెనుకబడి ఉన్నట్టు ఈ పోల్స్‌ ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ తప్పుడు లెక్కలని కొట్టిపారేసిన ట్రంప్‌ ఈ ఫలితాలు మీడియాలో లీకవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజ్‌కు బాధ్యులైన పోల్‌స్టర్స్‌ను తన ప్రచార బృందం నుంచి తొలగించేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ బరిలో రిపబ్లికన్‌ పార్టీ రేసులో ట్రంప్‌ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించి ట్రంప్‌ పోల్‌స్టర్స్‌ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.