ఫేస్ బుక్ మరో కొత్త బిజినెస్

ఫేస్ బుక్ మరో కొత్త బిజినెస్

18-06-2019

ఫేస్ బుక్ మరో కొత్త బిజినెస్

సామాజిక మాధ్యమంగా నెటిజన్లను కట్టిపడేస్తున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కొత్త బిజినెస్‌కు సిద్ధమవుతోంది. లిబ్రా లేదా గ్లోబల్‌కాయిన్‌ పేరుతో క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోంది. ఈ కరెన్సీ పేరు, చెల్లింపుల విధానం వంటి వివరాల్ని సంస్థ వెల్లడించబోంది. వీసా, మాస్టర్‌కార్డ్‌, పేపాల్‌, ఉబర్‌ వంటి దాదాపు 12 సంస్థల భాగస్వామ్యంతో ఫేస్‌బుక్‌ వచ్చే ఏడాది ఈ కొత్త క్రిప్టోకరెన్సీని తీసుకు వస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ సంస్థలన్నిటితో కలిపి ఇప్పటికే లిబ్రా పేరుతో ఒక కన్సార్షియంను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలన్నీ ఇందుకోసం కోటీ డాలర్ల చొప్పున పెట్టుబడులు కూడా పెట్టాయి.