హెచ్‌-4 వీసా రద్దు మరింత ఆలస్యం

హెచ్‌-4 వీసా రద్దు మరింత ఆలస్యం

19-06-2019

హెచ్‌-4 వీసా రద్దు మరింత ఆలస్యం

అమెరికాలో ఉండే భారత ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌-4 వీసా విధానం మరి కొంతకాలం కొనసాగనుంది. రద్దు ప్రక్రియకు సంబంధించిన చట్ట రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. హెచ్‌-4 సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాలన్నిటిపై సమీక్ష కొనసాగుతోందని యూఎస్‌ సిటిజన్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది.