ఫేస్‌బుక్‌ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు

ఫేస్‌బుక్‌ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు

19-06-2019

ఫేస్‌బుక్‌ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు

సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టిస్తున్న ఫేస్‌బుక్‌.. తన సొంత డిజిటల్‌ సొమ్ముతో క్రిప్టోకరెన్సీలోకి అడుగుపెట్టింది. లిబ్రా పేరుతో సరికొత్త కరెన్సీని ఫేస్‌బుక్‌ ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌గా ఉన్న ఫేస్‌బుక్‌ ఆన్‌లైన్‌ చెల్లింపులు చేపట్టే విధంగా ఈ క్రిప్టోకరెన్సీని తీర్చిదిద్దింది. లిబ్రా కోసం ఫేస్‌బుక్‌ ఇప్పటికే డజనుకు పైగా సంస్థలతో జట్టు కట్టింది. లిబ్రా పేరుతో తీసుకువచ్చిన క్రిప్టోకరెన్సీ ఓపెన్‌ సోర్స్‌ కోడ్‌గా ఉండనుంది. ఆసక్తి కలిగిన డెవలపర్లు ఎవరైనా యాప్స్‌ రూపం లోకి, సర్వీసులు, వ్యాపారాల్లోకి మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్‌ మనీని అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. జెనీవా కేంద్రంగా ఉన్న నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ ఒకటి బ్లాక్‌చెయిన్‌ ఆధారిత లిబ్రా వ్వవహారాలను పర్యవేక్షించనుంది. లిబ్రా పేరుతో ఉన్న క్రిప్టోకరెన్సీ విలువను స్థిరంగా ఉంచే విధంగా ఈ సంస్థ చర్యలు చేపట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు సేవలు (ఆన్‌బ్యాంక్డ్‌) అందుబాటులో లేని కోట్లాది మంది ప్రజలకు ఆన్‌లైన్‌ వాణిజ్యం, ఆర్థిక సర్వీసుల సదుపాయాలను అందించాలన్నదే తమ లక్ష్యమని లిబ్రా అసోసియేషన్‌ హెడ్‌ (పాలసీ) డాంటే డిస్పార్టే తెలిపారు.