డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములో “వనభోజనాలు”

డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములో “వనభోజనాలు”

19-06-2019

డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములో  “వనభోజనాలు”

డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) జూన్ 15, శనివారం 2019 నాడు వృక్షసంపదతో విలసిల్లే ‘పైలట్ నాల్ పార్కు’  ఆర్గయిల్ లో వనభోజనాలు జరిపారు. 'టీపాడ్ వనభోజనాల'  కార్యక్రమాన్ని చంద్రారెడ్డి పోలీస్ టీపాడ్ ప్రెసిడెంట్, ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి రామ్ మందాడి, బోర్ద్ ఆఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర,  లక్ష్మి పోరెడ్డి జాయింట్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెసరర్  కార్యక్రమ సమన్వయ కర్తలు మరియు సెక్రెటరి మాధవి లొకిరెడ్డి సహాయముతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్ల పెద్దలతో పాటు రెండువేల మందికి పైగా అధిక సంఖ్యలో డాలస్ వాస్తవ్యులు హాజరయ్యారు. శశి రెడ్డి కర్రి మరియు  మధుమతి వ్యాసరాజు స్వాగతము పలకరింపు పలకలతొ, ఫొటొ షూట్ అలంకరణలతొ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ గణేశుడికి కమిటీ సభ్యులు మరియు డాలస్ వాస్తవ్యులు కలిసి పూజ నిర్వహించారు. తదనంతరం 'ఫాథర్స్ డే' సందర్బంగా టీపాడ్ సంస్థ తండ్రులందరికి ‘కేక్ కట్టింగ్’  సెలెబెరేషన్స్ ఘనంగా చేసి అభినందనలను తెలియచేసింది. వనభోజనాల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమము 'ఫ్లాష్ మాబ్'  అనే చక్కటి నృత్య మాలిక లో కార్యవర్గ బృందంతో పాటు వచ్చిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులకి పరుగు పందెం, స్పూన్ విత్ లెమన్, గాలి పటాలు లాంటి అటల పోటీలను స్వప్న తుమ్మపాల నిర్వహించగా ఈపోటీల్లో గెలుపొందినవారికి టీపాడ్ సంస్థ బహూమతులను ప్రదానం గావించింది.

'టీపాడ్ వనభోజనాల' కార్యక్రమానికి టీపాడ్ సంస్థ కార్యవర్గ బృందం అందరూ కలిసి పచ్చటి చెట్ల  క్రింద కావాల్సిన గ్యాస్ స్టవ్ లు, వంట సామగ్రి,  ఆహార వస్తువులు  అన్ని సమకుర్చారు. సుధాకర్ కలసాని, కరణ్ పోరెడ్డి, రత్నఉప్పాల, రఘు వూత్కూరి, శ్రీనివాస్ అన్నమనేని, చిరంజీవి మేఘాంశ్ రెడ్ది, మరియు చిరంజీవి నివేద్ రెడ్డి వేడి వేడి  బార్బిక్యూ చికెన్,  వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులని విరివిగా, వొచ్చిన వారందరికి తాజాగా చేసి యిచ్చారు. ఉమ బండారు గారి పర్యవేక్షనలో జయ తెలకలపల్లి .ఇంద్రాణి పంచార్పుల, మంజుల తొడుపునూరి, ఫణి, శ్రీనివాస్ వేముల,లింగారెడ్డి అల్వా, శంకర్ పరిమళ్, శారద సింగిరెడ్డి ఉదయం నుండి సాయంత్రం వరకి జరిగిన  కార్యక్రమంలో ఉప్మా, టీ కాఫీల తో మొదలు పెట్టి. మటన్ బిరియాని, భగార అన్నం, వైట్ రైస్, ఆకు కూర పప్పు, పచ్చిపులుసు, ఆలు టమాట కుర్మా, కోడి కూర, టమాటా పచ్చడి, పైనాపిల్ రవ్వ కేసరి తీపి పదార్థము, పెరుగు తో రైతా, క్యారెట్స్-కీర,నిమ్మకాయ సలాడ్  మొదలగు రుచికరమైన కమ్మని  వంటలు చేసి ప్రేమాను  రాగాలతో వొచ్చిన వారందరికి మధ్యాహ్నం భోజనములో వడ్డించారు. తదనంతరము సాయంత్రం చల్లని మజ్జిగ, చల్లని వాటర్ మెలన్ ముక్కలను, ఐస్ క్రీమ్ లు, వేడి వేడిగా టీ , కాఫీలను అందచేసారు. రూపకన్నయ్య గిరి, రోజా అడెపు, అపర్ణ కొల్లూరి, శరత్ పున్ రెడ్డి, గాయత్రి గిరి, రేణుక చనుమోలు , కళ్యాణి తాడిమెట్టి, వేణు భాగ్యనగర్, సునిత రెడ్డి, సుధీర్, దీపిక మరియు శ్రీలత వడ్డించడము, కూరగయలు కత్తిరంచడము మొదలగు పనులు మిగతా కార్యవర్గ బృందం తో కలిసి చక్కగా చేసారు.

టీపాడ్ ఫౌండేషన్ కమిటీ, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రాజ వర్ధన్  గొంది, ఉపేందర్ తెలుగు, బోర్డు అఫ్ ట్రస్టీ కో చైర్ మాధవి సుంకిరెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీ బుచ్చి రెడ్డి గోలి, రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, అడ్వైజరి కమిటీ సభ్యులు  విక్ర,మ్ జంగం, విజయ్ రెడ్డి,న రేష్ సుంకిరెడ్డి, సతీష్ నాగిళ్ల , కొలాబరేషన్  కమిటీ వంశీ కృష్ణ, స్రవణ్ నిడిగంటి, మాధవి మెంట, లావణ్య యరకాల ఆధ్వర్యములో కార్యక్రమము విజయవంతగా జరుపబడినది.

ఫౌండేషన్ కమిటీ రఘువీర్ బండారు విలువైన సలహాలు, సూచనలతో కార్యక్రమం రూపుదిద్దుకొని వనభోజనాల కార్యక్రమం సంతొషంగా కొనసాగి విజయవంతమైంది. పాస్ట్ బోర్ద్ ఆఫ్ ట్రస్టీస్ రాం అన్నాడి, అశోక్ కొండల ఈవెంట్ కి సంభందించిన లాజిస్టిక్స్ సమకూర్చె విషయములో కీలక పాత్రను పొషించారు. ప్రతీ ఏటా పచ్చటి వాతావరణములో 'టీపాడ్ వనభోజనాలు' కార్యక్రమం జరిపి తెలుగు వారికే కాకుండా భారత దేశం నలుమూలల నుండి వచ్చే వారి మధ్య చక్కటి సంబంధ భాంధవ్యాలకు తోడ్పడుతుంది. కార్యక్రమం చివరిగా టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రా రెడ్డి పోలీస్, బోర్డు ఆప్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, వనభోజనాల కార్యక్రమ సమన్వయ కర్తలు లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల సంయుక్తంగా, పనిచేసిన కార్యకర్తలందరికి, స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు, పత్రిక మరియు ప్రసార మాధ్యమాలకు, వనభోజనాలు నిర్వహించటానికి కావాల్సిన ప్రాంగణ వసతులు కల్పించిన పైలట్ నాల్ పార్క యాజమాన్యానికి, దాతలకు, సహాయ పడిన ‘ఫార్మ్ టు కుక్’ యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

Click here for Event Gallery