చైనాకు మరో షాకిచ్చిన అమెరికా

చైనాకు మరో షాకిచ్చిన అమెరికా

24-06-2019

చైనాకు మరో షాకిచ్చిన అమెరికా

గూఢచర్యం ఆరోపణలతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ మేకర్‌ అయిన హువావేను నిషేధించి చైనాపై వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్‌ సర్కారు ఇప్పుడు మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీలు, సూపర్‌ కంప్యూటర్‌ తయారీలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పుడు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయించింది. అంటే ఆయా సంస్థలేవీ ఇకపై అమెరికా నుంచి విడిభాగాలను కొనుగోలు చేయలేవన్నమాట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కావాలనుకుంటే మాత్రం ప్రభుత్వం అనుమతి అవసరం. అమెరికా తాజా ఆంక్షలపై వాషింగ్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, ఇప్పటికే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుండగా, తాజా చర్యలతో ఇది మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలూ పట్టువిడుపులను ప్రదర్శించాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.