ఫెడ్‌ చైర్మన్‌గా జెనెట్‌ ఎలెన్‌ ?

ఫెడ్‌ చైర్మన్‌గా జెనెట్‌ ఎలెన్‌ ?

24-06-2019

ఫెడ్‌ చైర్మన్‌గా జెనెట్‌ ఎలెన్‌ ?

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ జరిపిన సమీక్షలో వడ్డీ రేట్ల కోత విధించమని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించినా ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ దానిని అమలు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 2.25-2.5 శాతం లక్ష్యిత శ్రేణిలోనే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఏడాదంతా రేట్ల కోత ఉండదని, 2020లోనే మళ్లీ రేట్ల కోత గురించి ఆలోచిస్తామని జెరోమ్‌ పావెల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జెరోమ్‌ పావెల్‌ చర్యలపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ట్రంప్‌ మీడియా సమావేశంలో జెరోమ్‌ పావెల్‌ గురించి ప్రస్తావిస్తూ తాను కోరినట్లు ఫెడ్‌రేట్ల కోత విధించేందుకు అవకాశమున్న పావెల్‌ అలా చేయలేదని ఆరోపించారు. అతని చర్యలపై తాను సంతోషంగా లేనని, ఈ విషయంలో అతను సరిగా వ్యవహరించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో జెరోమ్‌ పావెల్‌ స్థానంలో జెనెట్‌ ఎలెన్‌ను ఫెడ్‌ చైర్మన్‌గా ట్రంప్‌ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా పావెల్‌ ఫెడ్‌ చైర్మన్‌గా తన నాలుగేళ్ల పదవీ కాలన్నీ పూర్తి చేశారు.