సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

24-06-2019

సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కొనియాడారు. ఆయన దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియాలో టీడీపీ సింగపూర్‌ ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్‌పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ గెలుపోటములు టీడీపీకి కొత్త కాదని, ఎన్నికల్లో ఓడినా ప్రజల కోసమే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.