ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

25-06-2019

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆలీ ఖొమెనీని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కఠిన ఆంక్షలు విధించారు. ఓవల్‌ ఆఫీసులో ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఖొమేనీ, ఆయన సన్నిహిత సహచరులకు చెందిన కీలక ఆర్థిక వనరులపైన ఆయన ఆంక్షలు విధించారు. ఇరాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున తాము మరింత కఠినమైన ఆంక్షలను ఆదేశంపై విధించారని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌తో సంఘర్షణ తాను కోరుకోవడం లేదని అంటూనే, ఇరాన్‌ అణు బాంబును కలిగివుండడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రశ్నే లేదన్నారు. అమెరికా ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేస్తూ ఇరాన్‌కు చెందిన ఎనిమిది మంది సీనియర్‌ నావికా, వైమానిక, పదాతి దళ కమాండర్లపైన, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్సు కార్ప్సొ దిగుమతి చేసుకునే పరికరాలపైన ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.