అమెరికా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన

25-06-2019

అమెరికా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పొంపియో భారత్‌ వస్తున్నారు. ఆయన మూడు రోజుల పాటు ఇండియాలో టూర్‌ చేస్తారు. ఇటీవల భారత్‌లో జనరల్‌ ఎలక్షన్స్‌ ముగిసిన తర్వాత ఓ విదేశీ నేతతో జరుగుతున్న మొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కానున్నది. భారత్‌, అమెరికా మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి ఈ సమావేశం కీలకం కానున్నది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్‌ సమస్యలను ఇదే వేదికగా చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా జరగనున్నది. విదేశాంగ మంత్రి జయశంకర్‌తో అమెరికా మంత్రి పొంపియో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.