అమెరికా తలుపులు మూసేసింది...ఇరాన్‌

అమెరికా తలుపులు మూసేసింది...ఇరాన్‌

26-06-2019

అమెరికా తలుపులు మూసేసింది...ఇరాన్‌

తమ అత్యున్నత నాయకుడిని లక్ష్యంగా చేసుకుని తాజాగా విధించిన తెలివి తక్కువ ఆంక్షలతో అమెరికా దౌత్యపరమైన చర్చలకు తలుపులు మూసివేసిందని ఇరాన్‌ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుద్ధి మాంద్యంతో ఈ ఆంక్షలు జారీ చేసి ఉంటారని వ్యాఖ్యానించింది. అమెరికాకు వెళ్లాలన్న ప్రణాళికలేమీ లేని తమ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ (80)పైన ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సిగ్గుమాలిన, తెలివి తక్కువ పని అని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ మండిపడ్డారు. ఇస్లామిక్‌ రివల్యూషన్‌ సుప్రీం నాయకుడి (ఖమేనీ)పై అమెరికా విధించిన ఆంక్షలు ఆ దేశ నిరాశాన్పిృహలకు నిదర్శనం అని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్‌ మౌసావీ ట్వీట్‌ చేశారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ఇజ్రాయెల్‌లో స్పందిస్తూ ఇరాన్‌తో చర్చలకు సిద్దమేనన్నారు.