జి 20లో మోడీ, ట్రంప్‌ భేటీ

జి 20లో మోడీ, ట్రంప్‌ భేటీ

26-06-2019

జి 20లో మోడీ, ట్రంప్‌ భేటీ

జపాన్‌లో ఈ వారం జరగబోయే జి-20 సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వంటి ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని ట్రంప్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు మీడియా సమావేశంలో తెలిపారు. ఆ సమయంలో ఆయన వాణిజ్యంతో సహా అనేక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. జూన్‌ 28, 29 తేదీల్లో ఒసాకాలో జరిగే జి20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జూన్‌ 27న జపాన్‌ బయలుదేరుతారు. ట్రంప్‌ సమావేశం కాబోయే నాయకుల్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబె, ఇండియా ప్రధాని మోడీ, జర్మనీ ఛాన్సలర్‌ అంగేలా మెర్కెల్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ఉన్నారని ఆ అధికారి తెలిపారు. ఇండియాలో సాధారణ ఎన్నికల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి కలుసుకోబోతున్నారు.