అమెరికాతో చర్చలుండవ్‌

అమెరికాతో చర్చలుండవ్‌

26-06-2019

అమెరికాతో చర్చలుండవ్‌

అమెరికాతో ఇక మాటలుండవని ఇరాన్‌ ప్రకటించింది. దేశ పెద్ద సుప్రీం లీడర్‌ ఆయతోల్లా ఆలీ ఖమెవీ పై ఆంక్షలు వేయడమంటే చర్చలకు దారులను పూర్తిగా మూసివేసినట్లేనని పేర్కొంది. ఈ వారంలోగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి పైనా ఆంక్షలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఒక వైపు చర్చలంటూనే ఆంక్షలు విధించడాన్ని ఇరాన్‌ ప్రెసిడెంట్‌ హసన్‌ రౌహానీ తప్పుబట్టారు. ఇక మీదట అమెరికాతో చర్చలుండవని తేల్చి చెప్పారు.