ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులకు శుభవార్త
APEDB
Ramakrishna

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులకు శుభవార్త

17-05-2017

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులకు శుభవార్త

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులకు శుభవార్త. ఫేస్‌బుక్‌ గూటికి చెందిన ఈ అంతర్జాల వేదికపై చిత్రాలకు సొబగులు అద్దేందుకు కొత్త ఐచ్ఛికాలు వచ్చేశాయి. ఫోటోలకు కోలా చెవులు అతికించడం, ఓ వైపు కుంచించుకుపోయేలా చేయడం తదితర వినోదాత్మక హంగులు అందుబాటులోకి తెచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. వీడియోలను వెనుకనుంచి ముందుకు చూడటం, స్టిక్కర్లు అతికించడం లాంటి కొత్త ఆప్షన్లనూ సిద్ధంచేసినట్లు పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌కు స్నాప్‌చాట్‌ గట్టిపోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి సదుపాయాలు స్నాప్‌చాట్‌ కెమెరాలో అందుబాటులో ఉన్నాయి.