లెక్సింగ్టన్ లో భారత సంతతి వ్యక్తి అదృశ్యం
MarinaSkies
Kizen
APEDB

లెక్సింగ్టన్ లో భారత సంతతి వ్యక్తి అదృశ్యం

17-05-2017

లెక్సింగ్టన్ లో భారత సంతతి వ్యక్తి అదృశ్యం

అమెరికాలోని లెక్సింగ్టన్‌ ప్రాంతంలో నివసిస్తున్న భారతసంతతి వ్యక్తి అదృశ్యమయ్యాడు. 26ఏళ్ల రామ్‌జయకుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి బోస్టన్‌ స్ట్రీట్‌లో కారు పార్క్‌ చేసిన తర్వాత నుంచి అదృశ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ రామ్‌ తల్లిదండ్రులు లెక్సింగ్టన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గంటలో తిరిగి వస్తానని వెళ్లిన కుమారుడు ఇప్పటి వరకూ రాలేదని ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం రామ్‌ పార్క్‌ చేసిన కారు ఛార్లెస్‌ నది సమీపంలో కనిపించినట్లు ఇండియా-న్యూఇంగ్లాండ్‌ న్యూస్‌ వెల్లడింది. రామ్‌ జాడ వెతికేందుకు సహకరించేందుకు పోలీసులు స్థానికులను కోరారు. రామ్‌ కనపడకుండా పోయిన విషయాన్ని భారత సంతతి థియేటర్‌ ఆర్టిస్ట్‌ పూర్న జగన్నాథన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వాళ్ల స్థానిక ప్రజలకు తెలియజేశారు. అతడికి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాల్సిందిగా ఫేస్‌బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేశాడు.