విమానాల్లో ల్యాప్ టాప్ లు నిషేధం : అమెరికా
MarinaSkies
Kizen
APEDB

విమానాల్లో ల్యాప్ టాప్ లు నిషేధం : అమెరికా

17-05-2017

విమానాల్లో ల్యాప్ టాప్ లు నిషేధం : అమెరికా

సైబర్‌ ప్రపంచాన్ని  వణికిస్తున్న ర్యాన్సమ్‌కేర్‌ వాన్నా క్రై కారణంగా అమెరికాలోనూ ఆందోళన తీవ్రమైంది. ఈ నేపథ్యంలో యూరప్‌ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే  ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు తీసుకురావద్దని నిషేధం  విధించారు. యూరప్‌ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్లెట్‌ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం సూచించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్‌పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద  ల్యాప్‌టాప్స్‌ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. అవసరమైతే యూరోప్‌ ఎయిర్‌లైన్స్‌ను అమెరికాకు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని భావిస్తున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికార ప్రతినిధి డేవిడ్‌ లాపన్‌ అన్నారు. యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశాల ఎయిర్‌లైన్స్‌ను అమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా అమెరికా అడుగులు వేస్తుంది. యూరప్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్‌వేర్‌ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవన్నారు.