అందరికీ నచ్చిన తానా విందు

22nd TANA National Conference in Washington DC

వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల్లో అతిధులకోసం ఏర్పాటు చేసిన విందులో వడ్డించిన పదార్థాలు అందరికీ నచ్చేలా తయారు చేశారు. వేల సంఖ్యలో వచ్చినవారందరికీ నిర్వాహకులు భోజనాన్ని అందజేశారు. తెలుగు సాంప్రదాయ వంటకాలను రుచికరంగా ప్రవాసులకు అందజేశారు. గుత్తివంకాయ కూర, దోసకాయ పప్పు, వంకాయ దోసకాయ ఛట్నీ, దొండకాయ వేపుడు, చేపల పులుసు, కోడికూర, చిట్టిపొడి తదితర తెలుగు వంటకాలను రుచికరంగా వండివడ్డించారు. పెద్ద పెద్ద మహాసభలకు వంటను అందించడంలోపేరు గాంచిన తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, వర్జీనియాకు చెందిన ప్రముఖ హోటళ్ల వ్యాపారస్థుడు గౌర్నేని ప్రదీప్‌ ఆధ్వర్యంలో వేలాదిమంది ప్రతినిధులకు విందు ఏర్పాట్లు చేశారు.


                    Advertise with us !!!