చికాగో యూనివర్సిటీని సందర్శించిన ఒయు వి.సి
MarinaSkies
Kizen
APEDB

చికాగో యూనివర్సిటీని సందర్శించిన ఒయు వి.సి

18-05-2017

చికాగో యూనివర్సిటీని సందర్శించిన ఒయు వి.సి

అమెరికా దేశంలోని చికాగో స్టేట్‌ యూనివర్సిటీని ఒయు వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా చికాగో స్టేట్‌ యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ డా.డేవిడ్‌ కానిస్‌తో చర్చలు జరిపారు. రెండు యూనివర్సిటీలు కలిపి పరిశోధనలో పరస్పరం సహకరించుకునేందుకు, ఫ్యాకల్టీ అండ్‌ స్టూడెంట్స్‌ ఎక్సేంజ్‌ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం అవగాహన ఒప్పందం చేసుకునేందుకు అంగీకారం కుదిరిందని ఒ.యు పిఆర్‌వో తెలిపారు. కాగా ఒయు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఓ.యూకు రావాలని డా. డేవిడ్‌ కానిస్‌ను వైస్‌ ఛాన్సలర్‌ ప్రొ.ఎస్‌.రామచంద్రం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  ఒయు వి.సి ప్రొ.ఎస్‌. రామచంద్రం సతీమణితోపాటు ఒఎస్‌డి ప్రాఫెసర్‌ ఆర్‌.లింబాద్రి కూడా పాల్గొన్నారు.