తానాకు వారు చేసిన సేవలు శ్లాఘనీయం

tana-general-body-meeting-at-tana-conference-in-washington-dc

వాషింగ్టన్‌డీసీలో జరుగుతున్న 22వ తానా మహాసభల్లో ఓ ఆసక్తికరమైన కార్యక్రమం జరిగంది. శనివారం ఉదయం తానా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా వ్యవస్థాపక సభ్యులు, పలు కీలక పదవుల్లో సంస్థకు సేవ చేసిన కొడాలి చక్రధరరావు, చెరుకుపల్లి నెహ్రూలను అధ్యక్షుడు వేమన సతీష్‌ నేత త్వంలోని కార్యవర్గం ఘనంగా సత్కరించింది. చక్రధరరావు మాట్లాడుతూ ఆ పాత రోజుల్లో సేవ చేయాలనే తపన సరదాకి నలుగురు తెలుగువారు కలిసుండాలనే ఆరాటం ఉండేదని ఈ రోజుల్లో సాంకేతికత అభివృద్ధి చెందడంతో సమన్వయం బాగా పెరిగి చాలా మంచి పనులు సంస్థ ఆధ్వర్యంలో చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు చలపతి కొండ్రకుంట, లావు అంజయ్యచౌదరిలు సమాధానమిచ్చారు. గత రెండేళ్ళలో 190 మంది బాధితులకు టీంస్క్వేర్‌ ద్వారా సేవ చేశామని సభ్యులు తెలిపారు. తానా అంటే ఏదో సభలు జరుపుకుని కాసేపు సినిమా వాళ్లని తీసుకొస్తారనే భావన చాలా మంది ఎన్నారైల్లో ఉందని. అసలు సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు, దాని విలువకు తగిన ప్రాచుర్యం ప్రాధాన్యం కలగడం లేదని ఈ సందర్భంగా పలువురు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. దీనికి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జే తాళ్ళూరి ఆధ్వర్యంలో ఒక ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తానా నాయకులు జయరాం కోమటి, గంగాధర్‌ నాదెళ్ళ. బండ్ల హనుమయ్య, ఉప్పులూరి సుబ్బారావు, పద్మశ్రీ, పొట్లూరి రవి, పంత్ర సునీల్‌, కొల్లా అశోక్‌బాబు, పోలవరపు శ్రీకాంత్‌, లక్ష్మీ మోపర్తి, డా.కటికి ఉమా తదితరులు ప్రసంగించారు.


                    Advertise with us !!!