ఆయన మాటల వల్లే యాపిల్‌ బతికింది

ఆయన మాటల వల్లే యాపిల్‌ బతికింది

09-07-2019

ఆయన మాటల వల్లే యాపిల్‌ బతికింది

యాపిల్‌ సహ వ్వవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ సామర్థ్యం వల్లే యాపిల్‌ సంస్థ మూతబడే స్థితి నుంచి ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఎదిగిందని ప్రముఖ బిలియనీర్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గేట్స్‌.. స్టీవ్‌ జాబ్స్‌ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. స్టీవ్‌ జాబ్స్‌ మాటల మాంత్రికుడు. ఆయన చెప్పే ఉద్వేగపూరిత మాటలకు ఎంతో మంది ఆకర్షితులయ్యేవారు. అవి వారిపై ఎంతో ప్రభావం చూపించేవి. అయితే, నేను కూడా చిన్నపాటి మాంత్రికుడిని కావడం వల్ల స్టీవ్‌ జాబ్స్‌ మాటలు నాపై పని చేయలేదు. అయితే, ఆయనలా టాలెంట్‌ను గుర్తించే వ్యక్తిని, ప్రేరేపించే వ్యక్తిని, మంచి- చెడును నిఆజయితీగా చెప్పే వ్యక్తిని నేను మళ్లీ ఇంతవరకు చూడలేదు. వైఫల్యాలు చూసిన మళ్లీ వాటిని అధిగమించిన విజయం సాధించగల గొప్ప వ్యక్తి ఆయన అని అన్నారు.

1988లో నెక్ట్స్‌ను స్థాపించారు. అయితే, అది పూర్తిగా విఫలమైంది. ఆయన ఎక్కడా కుంగిపోకుండా మళ్లీ తన సమర్థతతో పైకి లేచారు. ఒక దశలో మూతబడే స్థితికి పడిపోయిన యాపిల్‌ను తన చతురతతో ముందుకు నడిపించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మర్చారు అని స్టీవ్‌ జాబ్స్‌ను గేట్స్‌ గుర్తు చేసుకున్నారు. స్టీవ్‌ జాబ్స్‌ 1976లో వోజ్నియాక్‌, రెనాల్డ్‌ వేన్‌తో కలసి యాపిల్‌ను స్థాపించారు. కొన్ని కారణాలతో 1985లో యాపిల్‌ను వీడి నెక్ట్స్‌ కంప్యూటర్స్‌ను ఆయన ప్రారంభించారు. కానీ, ఏడాదికే ఆ కంపెనీ నష్టపోయింది. 1996లో నెక్ట్స్‌ను యాపిల్‌ కొనుగోలు చేసింది. దీనితో జాబ్స్‌ మళ్లీ సొంత కంపెనీకి చేశారు. 2011లో క్లోమ క్యాన్సర్‌తో స్టీవ్‌ జాబ్స్‌ చనిపోయారు.