శుభవార్త చెప్పిన ఎయిర్‌ ఇండియా

శుభవార్త చెప్పిన ఎయిర్‌ ఇండియా

09-07-2019

శుభవార్త చెప్పిన ఎయిర్‌ ఇండియా

భారతదేశం నుంచి హజ్‌ యాత్ర కోసం సౌదీ అరేబియా దేశంలోని మక్కా, మదీనాలకు వెళ్లే హజ్‌ యాత్రికులకు ఎయిర్‌ ఇండియా శుభవార్త వెల్లడించింది. మన దేశంలోని వివిధ నగరాల నుంచి సౌదీకి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులు పవిత్రమైన జమ్‌ జమ్‌ నీటి క్యాన్లు తీసుకువచ్చేందుకు తాము అనుమతిస్తామని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఎయిర్‌ ఇండియా ఎ1966, ఎ 1964 విమానాల్లో జమ్‌ జమ్‌ నీటి క్యాన్లను అనుమతించేది లేదని గతంలో ఎయిర్‌ ఇండియా ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. మక్కాలోని అల్‌ హరాం మసీదులోని బావి నుంచి పవిత్రమైన జమ్‌ జమ్‌ నీటిని హజ్‌ యాత్రికులు క్యాన్లలో తీసుకురావడం ఆనవాయితీ. ప్రయాణికులకు అనుమతించే లగేజీ పరిధిలో జమ్‌ జమ్‌ నీటి క్యాన్లను తీసుకురావచ్చని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.