అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్‌ ఔషధం

అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్‌ ఔషధం

10-07-2019

అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్‌ ఔషధం

అమెరికా మార్కెట్లోకి కఫం (తెమడ) నుంచి విముక్తి కలిగించే ఓవర్‌ ది కౌంటర్‌ (ఓటీసీ) ఔషధమైన ముసినెక్స్‌ డీ ఎక్సెంటెండెడ్‌ టాబ్లెట్లను విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. ఓటీసి ఔషధమైన గువాఫెనెసిన్‌, సూడోఫిడ్రైన్‌ హెచ్‌సిఐ గొంతులో తెమడ ద్వారా వచ్చే ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తాయని తెలిపింది. స్టోర్‌ బ్రాండ్‌కు సమానమైన ముసినెన్స్‌డీ ని తొలిసారిగా ఇక్కడ మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ అమెరికా (ఓటీసీ) హెడ్‌ విలన్‌ కలవాడియా చెప్పారు. ఓటీసీ వ్యాపార విస్తరణకు డాక్టర్‌ రెడ్డీస్‌ కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మరోవైపు దగ్గు, జలుబు, అలర్జీ విభాగాల్లో కంపెనీ పోర్టుఫోలియో వృద్ధి చెందుతూ వస్తోందన్నారు.