టీడీపి భవిష్యత్తుకు ప్రమాదమేమీ లేదు...నక్కా ఆనంద్

టీడీపి భవిష్యత్తుకు ప్రమాదమేమీ లేదు...నక్కా ఆనంద్

10-07-2019

టీడీపి భవిష్యత్తుకు ప్రమాదమేమీ లేదు...నక్కా ఆనంద్

గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు వచ్చిన ముప్పు ఏదీ లేదని, దానికితోడు తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏం చేయలేరని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు.  న్యూజెర్సీలో నాట్స్‌ మాజీ అధ్యక్షులు, ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం సీనియర్‌ నాయకులు మన్నవ మోహన్‌ కష్ణ ఆధ్వర్యంలో న్యూజెర్సీ తెలుగుదేశం కార్యకర్తలతో  మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌ బాబు, కొల్లు రవీంద్ర, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఆనంద్‌ బాబు మాట్లాడుతూ..'దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌.1 చేయాలన్న సంకల్పం చంద్రబాబుది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం ఎంతో సంతప్తినిచ్చింది. ఎవరూ ఆందోళన చెందకండి. గెలుపోటములు సహజం. చంద్రబాబు మార్గదర్శకంలో పార్టీ మరింత పురోగతి చెందేలా అందరం సమష్టిగా కషి చేద్దాం' అని పిలుపునిచ్చారు.

మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..' గత ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కార్యకర్తలు చేసిన సేవలు అమూల్యమైనవి. శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా తెదేపా పనిచేస్తుంది. కార్యకర్తలను పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుంది' అని తెలిపారు. గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ..' తెదేపా ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలందరూ అండగా నిలవాలి. తెదేపాకి ఇలాంటి సంక్షోభాలు కొత్తకాదు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుంది' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు తెదేపా సీనియర్‌ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఐ నాయకులు శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ల, మోహన్‌ కుమార్‌ వెనిగళ్ల, రమేశ్‌ నూతలపాటి, చంద్ర కొణిదెల, సురేశ్‌ బొల్లు, రాజేశ్‌ బేతపూడి, న్యూజెర్సీ తెదేపా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులందరినీ న్యూజెర్సీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఘనంగా సత్కరించింది.