గ్రీన్‌కార్డ్‌ బిల్లుకు సెనెట్‌ ఆమోదం...భారతీయులకు లాభం

గ్రీన్‌కార్డ్‌ బిల్లుకు సెనెట్‌ ఆమోదం...భారతీయులకు లాభం

10-07-2019

గ్రీన్‌కార్డ్‌ బిల్లుకు సెనెట్‌ ఆమోదం...భారతీయులకు లాభం

 అమెరికాలో శాశ్వత నివాసం, ఉపాధి కోసం ఉద్దేశించిన గ్రీన్‌ కార్డు బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది.  గ్రీన్‌ కార్డు విషయంలో అమెరికా ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతానికి మించి ఇవ్వకూడదన్న కోటా నిబంధనలు భారత్‌ వలసదారులకు కష్టాలు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కోటా పరిమితినిఎత్తేయాలని కోరుతూ   సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో దశాబ్దాల తరబడి గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు లభించనున్నాయి.

జనాభా ఎక్కవ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధనలు అమలవుతూ ఉండడంతో భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హ్యారిస్‌ తన సహచరుడు మైక్‌లీతో కలిసి సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇదే తరహా బిల్లును కాంగ్రెస్‌ ప్రతినిధుల సభలో జో లాఫ్రెన్‌, కెన్‌బర్గ్‌లు ప్రవేశపెట్టారు.

హెచ్‌1బీ వీసాలతో అమెరికాకు వచ్చి గ్రీన్‌కార్డు కోసం దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదంతో మేలు జరుగుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయుల దరఖాస్తులన్నీ ఆమోదం పొందాలంటే కనీసం 70 ఏళ్లు పడుతుందని ఒక అంచనా ఉంది. తాజా బిల్లులో ఒక్కో దేశం మీద ఉన్న పరిమితిని సడలించారు. దీంతో భారత్‌, చైనా వంటిదేశాలకు భారీ ప్రయోజనం కలుగుతుంది.