భారత సంతతి విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

భారత సంతతి విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌

18-05-2017

భారత సంతతి విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌

భారత సంతతి విద్యార్థి ప్రణయ్‌ వరదా రికార్డు సృష్టించాడు. 14 ఏళ్లకే 50 వేల డాలర్ల అమెరికా బంపర్‌ ప్రైజ్‌ను కొల్లగొట్టేశాడు. నేషనల్‌ జాగ్రఫిక్‌ బీ కాంపిటేషన్‌లో పాల్గొని తొలిస్థానంలో నిలిచి భారీ మొత్తంలో రూ.32 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన అతడు ఈసారి మాత్రం ఛాన్స్‌ వేరేవారికి దక్కనివ్వకుండా చేశాడు. గత పదేళ్లుగా కూడా అమెరికాలో భారత సంతతి విద్యార్థులే ఈ ప్రైజ్‌ను ఎగరేసుకుపోతున్నారు. నేను ఈసారి పోటీలో గెలుస్తానని బలమైన నమ్మకం ఉంది. అది ఇప్పుడు నిజమైంది. దీనికోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు దక్కింది. ఇప్పుడు ఆ సంతృప్తిని ఎంజాయ్‌ చేస్తున్నాను అని ప్రణయ్‌ నేషనల్‌ జాగ్రఫిక్‌ బీ విజేతగా నిలిచిన అనంతరం చెప్పాడు. తక్లీమకన్‌ ఏడారిని టిబెట్‌ పీఠభూమి నుంచి వేరు చేస్తున్న పర్వతాలు ఏవి అని అడిగిన ప్రశ్నకు కున్‌లున్‌ పర్వాతాలు అని చెప్పి ఈ బహుమతి గెలుచుకున్నాడు. ఒక న్యూజెర్సీకి చెందిన మరో భారత సంతతి విద్యార్థి వేద భట్టారామ్‌ మూడో స్థానంలో నిలవగా విస్కాన్సిన్‌కు చెందిన థామస్‌ రైట్‌ రన్నరప్‌గా నిలిచాడు. భట్టారామ్‌కు 10వేల డాలర్లు, థామస్‌ రైట్‌కు 25వేల డాలర్ల బహుమతి దక్కింది. ఈ మొత్తాన్ని వీరికి స్కాలర్‌షిప్‌గా అందించడంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా అందిస్తారు.