11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ

11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ

11-07-2019

11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ

దేశవ్యాప్తంగా పాస్‌పోర్టుల జారీని మరింత సులభతరం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దరఖాస్తు చేసిన 11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. విచారణల పేరుతో ఇటీవల కాలంలో జాప్యం కావడంతో ఒక్కోసారి పాస్‌పోర్టు కూడా రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం పలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా దళారుల వ్వవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది. దీనితోపాటు పాస్‌పోర్టు కష్టాలపై లోక్‌సభలో సభ్యులు చర్చను లేవదీసారు.

విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్‌ మాట్లాడుతూ 11 రోజుల్లోనే అందిస్తున్నామన్నారు. పాస్‌పోర్టు పొందేందుకు ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారన్న ఎంపీ మనీష్‌ తివారి ప్రశ్నకు జవాబునిస్తూ పాస్‌పోర్టు విచారణ కోసం జిల్లా పోలీసులు యాప్‌ను వినియోగిస్తున్నారని దీనిని అవినీతి రహితంగా విచారణ జగరడంతో పాటు త్వరగా పాస్‌పోర్టును పొందేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. దేశంలో 36 పాస్‌పోర్టు కేంద్రాలున్నాయని, 93 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 412 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలున్నాయని వీటిని నడిపేందుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 731 జిల్లాల్లో పోలీస్‌ విచారణకు యాప్‌ను వినియోగిస్తున్నారన్నారు.