లండన్‌లో ఘనంగా బోనాలు

లండన్‌లో ఘనంగా బోనాలు

12-07-2019

లండన్‌లో ఘనంగా బోనాలు

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనగా నిర్వహించారు. వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, రూత్‌కాడ్బరి, ఇండియన్‌ హైకమిషన్‌ ప్రతినిధి ప్రేమ్‌జిత్‌, హౌన్సలా డిప్యూటీ మేయర్‌ రాగ్విందర్‌సిద్దు ముఖ్య అతిథులుగా హాజరైనట్టు టాక్‌ కార్యదర్శి రత్నాకర్‌ కడుదుల ఒక ప్రకటనలో తెలిపారు. లండన్‌ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతోపాటు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. పోతురాజు వేషధారణలో జయ్‌రెడ్డి ఆకట్టుకున్నారని తెలిపారు. టాక్‌ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్‌ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్రరెడ్డి కంది మాట్లాడుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నివిధాల తమకు అండగా ఉంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో అడ్వైజరీ చైర్మన్‌ గోపాల్‌ మేకల, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైజరీ వైస్‌ చైర్మన్‌ మాట్టా రెడ్డి, సభ్యులు నవీన్‌రెడ్డి, రత్నాకర్‌, శ్రీధర్‌రావు, శ్రీకాంత్‌ బెల్ల, సత్య పింగళి, సత్య చిలుముల, సత్యం కంది పాల్గొన్నారు.