ప్రపంచ బ్యాంక్‌ ఎండీగా అన్షులా కాంత్‌

ప్రపంచ బ్యాంక్‌ ఎండీగా అన్షులా కాంత్‌

13-07-2019

ప్రపంచ బ్యాంక్‌ ఎండీగా అన్షులా కాంత్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎండీ అన్షులా కాంత్‌, ప్రపంచ బ్యాంక్‌ ఎండీ, సీఎఫ్‌ఓగా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్‌సాస్‌ ఈ విషయం ప్రకటించారు. ఒక భాతర మహిళ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవిలో నియమించబడడం ఇదే మొదటిసారి. ప్రపంచ బ్యాంక్‌ ఎండీ, సీఎఫ్‌ఓగా కాంత్‌ పైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను పర్యవేక్షిస్తారు. ఇంకా అంతర్జాతీయ అభివృద్ధి సహాయ (ఐడీఏ) కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం బ్యాంక్‌ సీఈఓతో కలిసి పని చేస్తారు.

ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ నుంచి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కాంత్‌, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌ నుంచి పీజీ పూర్తి చేశారు. గత 35 సంవత్సరాలుగా ఎస్‌బీఐలో సీఎఫ్‌ఓ, ఎండీతో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.