ప్రధాని మోదీ అమెరికా పర్యటన ?

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ?

14-07-2019

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ?

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. న్యూయార్క్‌ నగరంలో జరిగే ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అమెరికాలోని భారత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. అందుకోసం చికాగో లేదా హౌస్టన్‌ నగరాలు వేదిక కానున్నాయన్నారు. భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం మోదీ ఐరాస సమావేశానికి వెళతారన్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా సెప్టెంబర్‌ 22న మోదీ ప్రసంగం కోసం ఏర్పాట్లు చేయాలని వారికి సమాచారం అందినట్లు తెలిపారు.