అంధకారంలో న్యూయార్క్‌ నగరం

అంధకారంలో న్యూయార్క్‌ నగరం

15-07-2019

అంధకారంలో న్యూయార్క్‌ నగరం

న్యూయార్క్‌ నగరంలోని మన్‌హట్టన్‌ ప్రాంతంలో శనివారం రాత్రి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఆ ప్రాంతం మొత్తం గాఢాంధకారంలో మునిగిపోయింది. ఒక మాన్‌హోల్‌లో రగిలిన మంటలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని నగర మేయర్‌ బిల్‌డి బ్లాసియో తెలిపారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో బ్రాడ్వే థియేటర్లు, సబ్‌వేలలో చీకట్లు కమ్ముకున్నాయి. టైమ్స్‌ స్క్వేర్‌లో కాంతులీనే బిల్‌బోర్డ్స్‌ వెలవెలపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో దాదాపు 42 వేల మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారని నగర్‌ విద్యుత్‌ అధికారులు తెలిపారు.