ఎన్నారై పాలసీ అమలుకు కృషి చేయండి

ఎన్నారై పాలసీ అమలుకు కృషి చేయండి

15-07-2019

ఎన్నారై పాలసీ అమలుకు కృషి చేయండి

ఎన్నారై పాలసీ అమలు కోసం కృషిచేయాని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్‌ విభాగం అధ్యక్షురాలు అభిలాష గొడిశాల టీఆర్‌ఎస్‌ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వర్‌రావును కోరారు. ఆమె ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. విదేశాల్లో ఉంటున్న తెలంగాణవారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు న్యాయం జరగాలంటే ఎన్నారై పాలసీ త్వరగ అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కువైట్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున చేపట్టిన కార్యక్రమాలను ఆమె నామాకు వివరించారు.