వారు స్వదేశాలకు వెళ్లిపోవాలి

వారు స్వదేశాలకు వెళ్లిపోవాలి

16-07-2019

వారు స్వదేశాలకు వెళ్లిపోవాలి

ప్రతిపక్ష డెమొక్రాట్లపై విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ పార్టీకి చెందిన నలుగురు మహిళ నేతలపై జాతి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. వారు నేరమయమైన తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి, అక్కడి పరిస్థితులను చక్కదిద్దవచ్చు కదా అని ట్వీట్‌ చేశారు. చట్టసభ అయిన కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇల్హాన్‌ ఒమర్‌ (మిన్నెసోటా), అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ (న్యూయార్క్‌), అయన్నా ప్రెస్లీ (మాస్సాచుసెట్స్‌), రషీదా త్లాయిబ్‌ (మిషిగాన్‌)లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వారిని తీవ్రవాద వామపక్ష కాంగ్రెస్‌ సభ్యులుగా అభివర్ణించారు. వీరిలో ఇల్హాన్‌ సోమాలియా నుంచి వలస రాగా, మిగిలిన ముగ్గురూ అమెరికాలో జన్మించినవారే.