సెప్టెంబరులో ప్రధాని మోదీ అమెరికా పర్యటన

సెప్టెంబరులో ప్రధాని మోదీ అమెరికా పర్యటన

16-07-2019

సెప్టెంబరులో ప్రధాని మోదీ అమెరికా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు చివరి వారంలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌తో పాటు, హ్యూస్టన్‌లోని ప్రవాస భారతీయులతో భేటీ అవుతారు. హ్యూస్టన్‌కు సెప్టెంబర్‌ 22న వచ్చే అవకాశం ఉందని, ఇందుకుతగ్గ సన్నాహాలను ప్రారంభించామని బీజేపీ విదేశీ మిత్రులు (ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ- ఓఎఫ్‌బీజేపీ) అనే సంస్థ ప్రతినిధులు తెలిపారు.