సీఎం జగన్‌కు నాటా ఆహ్వానం

సీఎం జగన్‌కు నాటా ఆహ్వానం

16-07-2019

సీఎం జగన్‌కు నాటా ఆహ్వానం

వచ్చే ఏడాది జూన్‌లో అమెరికాలోని న్యూజెర్సీలో జరగనున్న నాటా మహాసభలకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నాటా ప్రతినిధులు ఆహ్వానించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. నాటా కన్వెన్షన్‌-2020 ఆహ్వాన ప్రతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, ఇంటర్‌నేషనల్‌ ఉపాధ్యక్షుడు కిష్టపాటి రమణారెడ్డి, సంయుక్త కోశాధికిరా మేకా శివ, నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సాగంరెడ్డి అంజిరెడ్డి, భారత సమన్వయకర్త మల్లు ప్రసాదరెడ్డిలు ఉన్నారు.