భారత్‌తో సంబంధాలు మరింత బలపడాలి.. అమెరికా

భారత్‌తో సంబంధాలు మరింత బలపడాలి.. అమెరికా

18-07-2019

భారత్‌తో సంబంధాలు మరింత బలపడాలి.. అమెరికా

భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడాలని అమెరికా రక్షణ మంత్రి ప్రతినిధి మార్క్‌ టి ఎస్పర్‌ అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలో భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆయన సెనేట్‌ సాయుధ దళాల కమిటీ సభ్యుల ముందు హాజరయి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రక్షణ రంగంలో భారత్‌ ఇప్పటికే పెద్ద భాగస్వామిగా ఉందని అన్నారు. భారత్‌ వ్యతిరేక బృందాలపై పాకిస్థాన్‌ తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పడం, ఆల్‌ఖైదాను అణచివేయడంలో పాక్‌ పాత్రను గుర్తించినట్టు చెప్పారు. ప్రస్తుత ప్రపంచ వ్యవస్థను మార్చాలని చైనా భావిస్తోందని, అమెరికా అప్రమత్తంగా లేకపోతే కష్టమని అభిప్రాయపడ్డారు. చిన్న దేశాలకు రుణాలు ఇచ్చి, అక్కడి కీలక స్థావరాలను స్వాధీనం చేసుకుంటోందని చెప్పారు. మరోవైపు రాజీనామా చేసిన రక్షణ మంత్రి మాటిస్‌ స్థానంలో ఎస్పర్‌ను తీసుకోవచ్చని వినిపిస్తోంది.