హెచ్‌ 1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

హెచ్‌ 1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

19-07-2019

హెచ్‌ 1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దేశీయ కంపెనీల్లో నిపుణుల కొరత తీర్చేందుకు హెచ్‌-1బీ వీసా ఫీజు డబ్బుతో అమెరికన్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ తెలిపారు. వివిధ కంపెనీలే అమెరికన్లకు శిక్షణ ఇచ్చేలా ట్రంప్‌ యంత్రాంగం ఇండస్ట్రీ-రికగ్నైజ్డ్‌ అప్రెంటిస్‌ షిప్‌ సిస్టం అనే విధానం తెచ్చింది. హెచ్‌ 1బీ వీసా ఫీజు డబ్బు సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రెంటిస్‌ షిప్‌ గ్రాంట్‌గా అందజేసిందన్నారు. ఈ ఫీజును విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ, కృతిమ మేథరంగాల్లో అమెరికన్‌ నిపుణులకు శిక్షణ ఇస్తున్నామన్నారు.