విటమిన్‌ మాత్రలతో గుండెకు ముప్పు!

విటమిన్‌ మాత్రలతో గుండెకు ముప్పు!

19-07-2019

విటమిన్‌ మాత్రలతో గుండెకు ముప్పు!

విటమిన్లు, మినరల్స్‌ మాత్రలతో మేలు కంటే కీడే ఎక్కువని అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. వినమిన్లు, మినరల్స్‌ను ఎక్కువగా తీసుకునే వారికి గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని వారు చెబుతున్నారు. విటమిన్‌-డీ, కాల్షియం ట్యాబ్లెట్లు కూడా హానికరమే అని భావిస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలేవీ వారు తెలిపారు. పరిశోధనల్లో భాగంగా గతంలో నిర్వహించిన 227 క్లినికల్‌ ట్రయల్స్‌ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది డేటాను వారు పరిశీలించారు. ఈ క్రమంలో వారి ఈ వివరాలను గుర్తించి, వెల్లడించారు.