తానా 23వ మహాసభల వెన్యూకోసం జే తాళ్ళూరి బృందం అన్వేషణ

తానా 23వ మహాసభల వెన్యూకోసం జే తాళ్ళూరి బృందం అన్వేషణ

19-07-2019

తానా 23వ మహాసభల వెన్యూకోసం జే తాళ్ళూరి బృందం అన్వేషణ

తానా అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తరువాత జే తాళ్ళూరి తదుపరి 2021లో నిర్వహించే తానా 23వ ద్వైవార్షిక మహాసభలను ఎక్కడ నిర్వహించాలన్నదానిపై అన్వేషణ ప్రారంభించారు. ఇందులో భాగంగా అట్లాంటిక్‌ సిటీలోని కన్వెన్షన్‌ సెంటరును జే తాళ్ళూరితోపాటు తానా కార్యదర్శి రవి పొట్లూరి, లక్ష్మీ దేవినేని, విశ్వనాథ్‌ నాయునిపాటి, తూనుగుంట్ల శిరీష, కసుకుర్తి రాజా, బ్రహ్మాజీ వలివేటి, సుమంత్‌ రామిశెట్టి, పాతూరి నాగభూషణం తదితరులతో కూడిన బృందం పరిశీలించింది. ఇక్కడి హోటళ్లు, వసతి ఏర్పాట్లను వారు చూశారు. తరువాత బృందం నాయకులు సమావేశమయ్యారు. కాకపోతే ఇంకా మహాసభల వెన్యూ గురించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.