తానా ఫౌండేషన్ చైర్మన్ గా మరోసారి నిరంజన్ శృంగవరపు ఎన్నిక

తానా ఫౌండేషన్ చైర్మన్ గా మరోసారి నిరంజన్ శృంగవరపు ఎన్నిక

22-07-2019

తానా ఫౌండేషన్ చైర్మన్ గా మరోసారి నిరంజన్ శృంగవరపు ఎన్నిక

తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శృంగవరపు నిరంజన్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన మరో రెండేళ్లు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాబోయే రెండేళ్లలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలంచడమే లక్ష్యంగా ముందుకుసాగుతామని ఈ సందర్భంగా నిరంజన్‌ వెల్లడించారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ సంక్షేమం కోసం పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులకు కూడా 'తానా ఫౌండేషన్‌' పేరిట ప్రత్యేక సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.