ప్రవాస వైద్యుల సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

ప్రవాస వైద్యుల సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

22-07-2019

ప్రవాస వైద్యుల సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వం మాత్రమే పనిచేస్తే సరిపోదని, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం ఉంటేనే ఆరోగ్య భారత్‌ సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (అమెరికాలో భారత సంతతి వైద్యుల సంఘం-ఆపి) 13వ అంతర్జాతీయ వైద్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో అంటువ్యాధులకన్నా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోందని అన్నారు. వీటి నివారణపై దృష్టిపెట్టాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో వైద్య రంగం ఎంత విస్తరిస్తున్నా.. సిబ్బంది, మౌలిక వసతుల కొరత వేధిస్తోందన్నారు. ప్రైవేటు- పబ్లిక్‌ భాగస్వామ్యం దీనికి పరిష్కారం చూపగలదని, వియత్నాం తదితర దేశాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. మనవద్ద కూడా వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల మంది లబ్దిపొందారని వెల్లడించారు. మంచి ఆహారం, యోగా లాంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.