సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. సింగపూర్‌లోని సుంగేకేడుట్లోని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో కన్నుల పండువగా జరుపుకొన్నారు. తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజులు, పులివేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో 700 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా తీన్నార్ స్టెప్పులతో అదరగొట్టారు. పూజాకార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రెండేండ్లుగా బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీసీఎస్ఎస్ అద్యక్షుడు నీలం మహేందర్ తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్నవారికి, దాతలకు సొసైటీ కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. బోనాల ఉత్సవాల్లో టీసీఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్‌గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్‌కుమార్ చెన్నోజ్వాల తదితరులు పాల్గొన్నారు.