బీజేపీ లోకి భారీగా ప్రవాసీ తెలంగాణ బిడ్డలు - ముహర్తం నవంబర్ 2019

బీజేపీ లోకి భారీగా ప్రవాసీ తెలంగాణ బిడ్డలు - ముహర్తం నవంబర్ 2019

22-07-2019

బీజేపీ లోకి భారీగా ప్రవాసీ తెలంగాణ బిడ్డలు  - ముహర్తం నవంబర్  2019

డా|| లక్ష్మణ్ ఆధ్వర్యములో టీడీఫ్ మాజీ అధ్యక్షుడు (పార్మసిస్ట్) లక్ష్మణ్ బీజేపీ లోకి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షలు డా|| కోవా లక్ష్మణ్ అమెరికా పర్యటన లో భాగంగా న్యూయార్క్ రాష్ట్రములో డీర్ పార్క్ నగరం లో కరుడు గట్టిన తెలంగాణ ఉద్యమకారులు, గతంలో ఉద్యమంలో క్రియాశీలకంగ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమికాని పోషించిన తెలంగాణ మిత్రులతో మీట్ అండ్ గ్రీట్ జరిగింది.

ఈ సందర్భముగా  డా|| లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ లో జరుగుతున్న పరిస్థితులను, టి ఆర్ స్ ఒంటెద్దు పోకడలు, కుటుంబ పాలనా, నిధుల దుర్వినియోగం, ఉద్యోగాలు, విద్య, వైద్యం, మహిళా, రైతు సమస్యలపై తెలంగాణ బిడ్డలు అడిగి తెలుసుకున్రు. ఈ సందర్భముగా డా|| లక్ష్మణ్ , తెలంగాణ లక్ష్మణ్ గ పేరు పొందిన, టీడీఫ్ మాజీ అధ్యక్షుడు (పార్మసిస్ట్) లక్ష్మణ్, కరుడు గట్టిన  తెలంగాణ వాది ఐన ఏనుగు లక్ష్మణ్ ను బీజేపీ లోకి ఆహ్హానించారు, దానికి సానుకూలంగా స్పందించి నవంబర్ నెల ముహర్తముగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ కార్యక్రమంలో అఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షలు కృష్ణ రెడ్డి, అఫ్ బీజేపీ నేషనల్ యూత్ కో -కన్వెనర్ విలాస్ జంబుల, అఫ్ బీజేపీ న్యూజెర్సీ యూత్ కో -కన్వెనర్ శ్రీకాంత్ రెడ్డి, అఫ్ బీజేపీ జనరల్ సెక్రటరీ నీలిమ మదన్, శివ దాసన్,  ప్రదీప్ కట్ట, అమర్, శ్రీకాంత్, రవి తుమ్మ, యోగి, అనిత, విజయ, ఆనంద్, ఫణి భూషణ్ పాల్గొన్నారు.

Click here for Event Gallery