భారతీయ శాస్త్రవేత్తకు డేన్‌ డేవిడ్‌ పురస్కారం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

భారతీయ శాస్త్రవేత్తకు డేన్‌ డేవిడ్‌ పురస్కారం

19-05-2017

భారతీయ శాస్త్రవేత్తకు డేన్‌ డేవిడ్‌ పురస్కారం

అంతరిక్ష విభాగంలో చేసిన విశేష కృషికిగాను భారతీయ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ కులకర్ణిని ప్రఖ్యాత ఇజ్రాయెల్‌ డేన్‌ డేవిడ్‌ పురస్కారం వరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీలో ఖగోళ భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా ఆయన పనిచేస్తున్నారు. రాత్రిపూట ఆకాశంలో చోటుచేసుకునే పరిణామాలపై అధ్యయనానికి పాలోమర్‌ ట్రాన్సియెంట్‌ ఫ్యాక్టరీ పేరిట ఆయన ఓ పరిశోధన చేపట్టారు. దీంతో వేలకొద్దీ నక్షత్ర విస్ఫోటనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 21న  జరిగే ప్రత్యేక కార్యక్రమంలో డేన్‌ డేవిడ్‌ ఫౌండేషన్‌ శ్రీనివాస్‌కు పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. రూ.6.5 కోట్ల ( మిలియన్‌ డాలర్లు) నగదు బహుమతిని అందిస్తుంది. ఏటా మావన, సామాజిక, విజ్ఞాన శాస్త్రల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి ఈ పురస్కారం ఇస్తారు.