ట్రంప్‌ దెబ్బకు మార్కెట్లలో కలవరం
APEDB

ట్రంప్‌ దెబ్బకు మార్కెట్లలో కలవరం

19-05-2017

ట్రంప్‌ దెబ్బకు మార్కెట్లలో కలవరం

సూచీల లాభాలకు అడ్డుకట్ట పడింది. వరుసగా మూడు రోజుల పాటు రికార్డు గరిష్ఠాల వద్ద ముగిసిన మార్కెట్లకు, అమెరికాలో  తలెత్తిన రాజకీయ అనిశ్చితి పరిస్థితుల రూపంలో ఊహించని అవాంతరం ఎదురుపడింది. రష్యాతో సంబంధాలపై జాతీయ భద్రతా మాజీ సలహాదారు మైఖేల్‌ ఫ్లిన్‌పై జరుగుతున్న విచారంలో ట్రంప్‌ జోక్యం చేసుకోవడంతో పాటు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమేపై ఒత్తిడి తీసుకొచ్చారన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై సైతం పడింది. ఈ పరిణామాల వల్ల ట్రంప్‌ అభిశంసనకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గరిష్ఠ స్థాయిల్లో మదుపర్ల లాభాల స్వీకరణ సైతం ఇందుకు తోడైంది.