డల్లాస్ లో ఘనంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

డల్లాస్ లో ఘనంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

23-07-2019

డల్లాస్ లో ఘనంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, సుపథం సంస్థ సహకారంతో ఫర్మ్‌విల్లేలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. జూలై 20వ తేదీ జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి ఎంతోమంది ప్రముఖులు భక్తులు హాజరయ్యారు. దాదాపు 3,000 మంది ఈ కళ్యాణానికి వచ్చారని నిర్వాహకులు చెప్పారు. ఉదయం 6 నుంచి స్వామివారి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుమలలో జరిగినట్లుగానే ఉదయం సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాలను నిర్వహించి కళ్యాణ వేడుకలను ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్‌డి సుబ్బారాయుడు కార్యక్రమాలను ప్రారంభించారు.

తిరుపతి నుంచి వచ్చిన అర్చకులు సుప్రభాతం పఠిస్తూ స్వామివారిని మేల్కొలిపారు. తరువాత విష్ణు సహస్రనామం పారాయణం చేశారు. అభిషేకం కార్యక్రమం తరువాత కళ్యాణోత్సవం చేశారు. మీనాక్షి అనిపిండి ఈ?సందర్భంగా అన్నమయ్య కీర్తనలను పాడారు. దాదాపు 100 మంది వలంటీర్లు అహర్నిశలు ఈ కార్యక్రమం విజయవంతానికి శ్రమించారు.

టీటీడి అధికారి సుబ్బారాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చాలా బాగా చేశారని నిర్వాహకులను అభినందిచారు. భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోర్‌ కమిటీ సభ్యులు సత్యనారాయణ పులిపాక, విజయ్‌ తొడపునూరి, మహేష్‌ ఆదిభట్ల, రవి ఆకుల, గోపాల్‌ పొనంగి, రవి గుజరాల, వెంకట్‌ కొనకంచి, ప్రవీణ్‌ అబ్బినేని, జయప్రకాష్‌, ఆర్‌కె. పండిట్‌, ఫల్గుణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కూతురు, మంజు, పద్మజా నాయుడు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.