అమెరికా వర్శిటీలో ఉచితంగా హిందీ బోధన

అమెరికా వర్శిటీలో ఉచితంగా హిందీ బోధన

12-08-2019

అమెరికా వర్శిటీలో ఉచితంగా హిందీ బోధన

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీలో ఆరు వారాల పాటు ఉచితంగా హిందీ తరగతులు నిర్వహించడానికి అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. ఈ తరగతులను ఆగస్టు 28న ప్రారంభిస్తారు. దౌత్య కార్యాలయానికి చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్‌ మోక్స్‌ రాజ్‌ హందీ బోధిస్తారు. ఈ ఏడాది మొదట్లో వారానికి ఒకసారి దౌత్య కార్యాలయ ఆవరణలోనే గంటపాటు హిందీ తరగతులు ఉచితంగా నిర్వహించడం ఆసక్తిగా పురిగొల్పి ఏడు దేశాలకు చెందిన 87 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఇక హిందీ భాషపై మక్కువ ఎంత ఉందో తెలియ చేస్తుందని ఈ ప్రోత్సాహం తోనే తాము తరగతుల నిర్వహణకు పూనుకుంటున్నామని సిగూరు సెంటర్‌ ఫర్‌ ఆసియన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ బెంజిమిన్‌ డి హాఫ్‌ కిన్స్‌ చెప్పారు.