యుద్ధమంటే ఇష్టం లేదు.. కానీ నేను దేశభక్తురాలిని

యుద్ధమంటే ఇష్టం లేదు.. కానీ నేను దేశభక్తురాలిని

12-08-2019

యుద్ధమంటే ఇష్టం లేదు.. కానీ నేను దేశభక్తురాలిని

ఒక టీవీ కార్యక్రమంలో నటి ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్‌ మహిళ దురుసుగా మాట్లాడారు. లాస్‌ ఏంజెలిస్‌ లో జరిగిన బ్యూటీకాన్‌ పేరిట జరిగిన టీవీ షోలో ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రేక్షకులు ప్రశ్నలు అడుగుతున్న క్రమంలో.. ఓ మహిళ పాకిస్థానీ అని చెబుతూ ప్రియాకంను తీవ్రంగా విమర్శించారు. బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన వైమానిక దాడులు నిర్వహించినప్పుడు ప్రియాంక చేసిన జైహింద్‌ ట్వీట్‌ను ఆ మహిళ తప్పుబట్టారు. ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉండి కూడా పాక్‌పై అణుయుద్ధానికి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అందుకు దీటుగా బదులిచ్చిన ప్రియాంక, తాను ముందు భారతీయురాలినని, పాకిస్థాన్‌లో కూడా చాలామంది స్నేహితులున్నారని చెప్పారు. యుద్ధమంటే తనకు ఇష్టం లేదు కానీ దేశభక్తురాలినని వ్యాఖ్యానించారు. ఊరికే అరచి శక్తి వృథా చేసుకోవద్దంటూ ఆ మహిళ నోటికి తాళం వేశారు.